Hanamkonda: హనుమకొండలో బతుకమ్మ, దసరా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష!
Hanamkonda: హనుమకొండ జిల్లాలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశం.
Hanamkonda: హనుమకొండలో బతుకమ్మ, దసరా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష!
Hanamkonda: జిల్లాలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తిచేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఈ నెల 10వ తేదీ నుండి 21 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాలకు సంబందించి
వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, ఇతర శాఖల అధికారులతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమీక్షించారు.
ఈ సందర్బంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతీ పండుగకు సంబంధిత అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే అన్నీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవచ్చన్నారు.
అధికారులు సమన్వయంతో బాధ్యతయుతంగా విధులని నిర్వర్తించి బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా జరిగేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ శాఖ, తదితర శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.... ఎంగిలి పూల బతుకమ్మ వేయి స్తంభాల గుడిలో.. అలాగే సద్దుల బతుకమ్మ వేడుకలు పద్మాక్షమ్మ ఆలయంలో జరుగుతాయాన్నారు. సంబంధిత అధికారులు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించి ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా చూడాలన్నారు.
బతుకమ్మ, దసరా ఉత్సవాలు జరిగే ప్రదేశాలలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు.
ఈ సమావేశంలో భద్రకాళి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల గురించిన వివరాలను ప్రధానార్చకులు భద్రకాళి శేషు వివరించగా, వేయి స్తంభాల గుడి, పద్మాక్షమ్మ దేవాలయాలలో జరగనున్న బతుకమ్మ ఉత్సవాలను గురించి ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, శంకర్ శర్మ అర్చకులు వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత , గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న , జడ్పీ సీఈఓ శేషాద్రి, డిఆర్డివో మేన శ్రీను, పరకాల, హనుమకొండ ఆర్డీవోలు వెంకన్న , వెంకటేష్ , దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, వివిధ శాఖల అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.




