Hanamkonda: హనుమకొండలో కామ్రేడ్ భగవాన్ దాస్ జయంతి: విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ కడియం కావ్య!

Hanamkonda: హనుమకొండ అశోక జంక్షన్‌లో సీనియర్ కమ్యూనిస్టు నేత బీఆర్ భగవాన్ దాస్ 96వ జయంతి వేడుకలు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హాజరై భగవాన్ దాస్ విగ్రహానికి పుష్పాంజలి.

AJAY, HANMAKONDA
Published on: 8 Jun 2026 4:13 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండలో కామ్రేడ్ భగవాన్ దాస్ జయంతి: విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ కడియం కావ్య!

Hanamkonda: ప్రముఖ కార్మిక నాయకుడు, సీనియర్ కమ్యూనిస్టు యోధుడు బీఆర్ భగవాన్ దాస్ 96వ జయంతి సందర్భంగా హనుమకొండ అశోక జంక్షన్‌లో సోమవారం నిర్వహించిన వేడుకల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య పాల్గొని వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ.., సీపీఐ పార్టీ నుంచి రాష్ట్రానికి విశిష్టమైన గుర్తింపు తీసుకొచ్చిన మహానేతల్లో భగవాన్ దాస్ ఒకరని పేర్కొన్నారు. కార్మికులు, గుడిసెవాసులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాటం చేశారని కొనియాడారు. సాగునీటి వసతులు, ఉపాధి అవకాశాల కల్పన, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

భగవాన్ దాస్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఈ ప్రాంత యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. పేదల స్థిర నివాసాలు, ఉపాధి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన ఉద్యమాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భగవాన్ దాస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఎంపీ స్పష్టం చేశారు. సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటినుంచో ప్రజాస్వామ్య, లౌకికవాద విలువల పరిరక్షణ కోసం కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.

దేశ రాజ్యాంగాన్ని, సెక్యులర్ స్ఫూర్తిని కాపాడుకోవడంలో ఇరు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, భగవాన్ దాస్ కుమారులు డాక్టర్ బి. రాజ్ సిద్దార్థ, బీఆర్ లెనిన్, బిఆర్ఎస్ నాయకులు మేడిపల్లి శోభన్ బాబు, ఆవోపా జిల్లా అధ్యక్షులు డి. ఈశ్వరయ్య, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. తోట సుధాకర్, కేకే, పి. అశోక్, గోకారపు శ్యామ్, బొడిగె శ్రీను,సిపిఐ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story