Hanamkonda: నడికూడలో కోతుల బెడదకు చెక్ పెట్టిన సర్పంచ్!

Hanamkonda: హనుమకొండ జిల్లా నడికూడలో కోతుల బెడదకు సర్పంచ్ కుడ్ల మలహల్ రావు చెక్ పెట్టారు. కోతులు పట్టేవారిని పిలిపించి సమస్యను పరిష్కరించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 13 Oct 2026 8:47 PM IST
Hanamkonda
X

Hanamkonda: నడికూడలో కోతుల బెడదకు చెక్ పెట్టిన సర్పంచ్!

హనుమకొండ: హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో కోతుల బెడదకు సర్పంచ్ కుడ్ల మలహల్ రావు చెక్ పెట్టారు. గ్రామంలో కోతుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు చెప్పడంతో వెంటనే స్పందించి, కోతులు పట్టేవారిని పిలిపించి కోతులను పట్టించారు.

గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీరుస్తానని సర్పంచ్ అన్నారు. ఈ చర్య పట్ల గ్రామస్తులు సర్పంచ్‌ను అభినందించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL