Hanamkonda: ఘనంగా ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డ్స్ వేడుకలు
Hanamkonda: హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డ్స్ వేడుకలు నిర్వహించారు.
Hanamkonda: ఘనంగా ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డ్స్ వేడుకలు
హన్మకొండ: హన్మకొండ పట్టణం స్థానిక పబ్లిక్ గార్డెన్ లోని పద్మశ్రీ డా॥ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో చాచా నెహ్రూ జయంతి మరియు బాలల దినోత్సవం పురస్కరించుకుని సకల కళల సంబరాల జాతరలో భాగంగా ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డ్స్ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ శ్రీ ఈగ మల్లేశం గారు
ఈ కార్యక్రమంలో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ నిర్వాహకులు జడల శివ, జడల హరిత, నిమ్మల శ్రీనివాస్, కరిమిల్ల సంపత్ రావు, గుడికందుల సంపత్ కుమార్, రోజారాణి, చందన, బిక్షపతి మరియు తదితరులు పాల్గొన్నారు.




