Hanamkonda: హన్మకొండలో రూ.52 వేల గుట్కా స్వాధీనం
Hanamkonda: టైలర్ స్ట్రీట్‌లోని కిరాణా షాప్‌పై పోలీసుల అకస్మాత్తు దాడి.. రూ.52 వేల విలువైన పొగాకు ఉత్పత్తుల స్వాధీనం, నిందితుడి అరెస్ట్.
Hanamkonda: హన్మకొండలో రూ.52 వేల గుట్కా స్వాధీనం
హన్మకొండ: టైలర్ స్ట్రీట్ లోని మహాదేవ్ జనరల్ స్టోర్ అనే కిరాణా స్టోర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
నిందితుడు భూపేందర్ చౌదరి అట్టి నిషేధిత పొగాకు ఉత్పత్తులను ఇతర ప్రాంతాల నుండి తెప్పించి ఇక్కడ పలు షాపుల వారికి అమ్ముతున్నట్టు విచారణలో వెల్లడైంది అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
నమ్మదగిన సమాచారం మేరకు హన్మకొండ ఎస్సై కిషోర్ మరియు ఏఎస్ఐ లు సర్వేషం, రఘునరెడ్డి, కాన్స్టేబుల్ మోహన్ నాయక్ అట్టి కిరాణా షాప్ పై రైడ్ చెసి గుట్కాలు స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు.
Next Story




