Hanamkonda: హనుమకొండలో వృద్ధురాలి మెడలోంచి బంగారు గొలుసు అపహరణ!

Hanamkonda: హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీహెచ్ కాలనీలో దారుణం.

AJAY, HANMAKONDA
Published on: 21 Jun 2026 7:45 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండలో వృద్ధురాలి మెడలోంచి బంగారు గొలుసు అపహరణ!

Hanamkonda: హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ తెలిపారు. బాధితురాలు పుష్పలత 69 సంవత్సరాలు ఫిర్యాదు మేరకు, ఈ రోజు ఉదయం SBH కాలనీ లోని తన ఇంటి సమీపంలో ఉండగా,

గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి ఆమె మెడలో ధరించిన బంగారు గొలుసును అపహరించి పరారైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై సుబేదారి ఇన్స్పెక్టర్ బాధితురాలి ఇంటి వద్దకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

సంఘటన స్థల పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు వెల్లడించారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలు తమ బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ సూచించారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story