Hanamkonda: హనుమకొండలో మొక్కలు నాటిన యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి

Hanamkonda: హనుమకొండ 60వ డివిజన్‌లో పర్యటించి, బ్యాంక్ కాలనీలో మొక్కలు నాటిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు, యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 8 Aug 2026 7:51 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండలో మొక్కలు నాటిన యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి

హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువ నాయకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు శనివారం 60వ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బ్యాంక్ కాలనీలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సుమారు 20 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు.

ప్రతి శనివారం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దాని సంరక్షణకు బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story