Parkal: పరకాల మండలం నాగారంలో ఘనంగా చేనేత వృత్తి పునఃప్రారంభం!
Parkal: శ్రీ భక్త మార్కండేయ మహర్షి ఆశీస్సులతో పరకాల మండలం నాగారం గ్రామంలో చేనేత వృత్తి పునఃప్రారంభం. నూతన గుంట మగ్గాలపై కార్పెట్ల తయారీ ప్రారంభించిన సహకార సంఘం.
Parkal: పరకాల మండలం నాగారంలో ఘనంగా చేనేత వృత్తి పునఃప్రారంభం!
Parkal: నాగారం గ్రామంలోచేనేత రంగాన్ని పూర్వ వైభవం తీసుక రావాలని ఆశయంతో చేనేత కార్మికులకు నిరంతరం పని కల్పించాలనే ఉద్దేశంతో నాగారం చేనేత సహకార సంఘంలో కార్పెట్లు (జంపకాన) తయారు చేయడానికి నూతన గుంట మగ్గాలు ఏర్పాటు చేసి పునర్ ప్రారంభం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాగారం పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు మెండు కృష్ణమూర్తి, కులం ఉపాధ్యక్షులు మరియు సంఘం డైరెక్టర్ మోతె రఘుపతి, సంఘం డైరెక్టర్ పురోహితులు వావిలాల రాజసమ్మయ్య, సామల శేఖరయ్య, దాసరి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.




