Hanumakonda: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిరుపేదలకు న్యాయం చేయాలి: టీడీపీ!

Hanumakonda: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో నిజమైన నిరుపేదలు, వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆత్మకూరు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డికి టీడీపీ నేత రాజేశ్వర్ రావు వినతిపత్రం ఇచ్చారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 12 Nov 2026 2:37 PM IST
Hanumakonda
X

Hanumakonda: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిరుపేదలకు న్యాయం చేయాలి: టీడీపీ!

హనుమకొండ: ఆత్మకూరు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో నిజమైన నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ మండల అధ్యక్షుడు మరిగిద్దె రాజేశ్వర్ రావు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు ఆశాకిరణంగా నిలవాలని, కేటాయింపుల్లో రాజకీయాలకు, స్వార్థ ప్రయోజనాలకు తావులేకుండా అర్హులైన పేద కుటుంబాలను నిష్పక్షపాతంగా గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

పెద్దాపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు సిద్ధోజి రాజమౌళికి సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి నిరుపేద, వికలాంగ కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి మానవతా దృక్పథంతో ఇల్లు మంజూరు చేయాలని అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిజంగా ఇల్లు అవసరమైన ప్రతి నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL