Hanumakonda: ఈవీఎంల గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్!
Hanumakonda: హనుమకొండ సుబేదారి రెడ్‌క్రాస్ సమీపంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీల పనితీరును పరిశీలించారు.
Hanumakonda: ఈవీఎంల గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్!
హనుమకొండ: హనుమకొండ సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) భద్రపరిచిన గోదాంను నెలవారి తనిఖీలలో భాగంగా హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోదాంకు వేసి ఉన్న సీళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈవీఎం గోదాం వద్ద భద్రత, గోదాం పరిసరాల నిర్వహణ, సీసీటీవీ కెమెరాల పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు. అదేవిధంగా ఈవీఎం గోదాం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని భద్రతా సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.




