Hanumakonda: రెవెన్యూ దరఖాస్తులు గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్!

Hanumakonda: నడికూడ మండలంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పర్యటన. తహశీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తుల పరిశీలన.

Narender, Staff Reporter  -Warangal
Published on: 18 Sept 2026 4:54 PM IST
Hanumakonda
X

Hanumakonda: రెవెన్యూ దరఖాస్తులు గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్!

హనుమకొండ: రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉండకుండా నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా నడికూడ మండల తహసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న భూభారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.

దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి తహసీల్దార్ రాణి, ఇతర అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయంలోని రికార్డు రూము నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించారు. రికార్డు రూముకు సంబంధించిన పలు అంశాలను తహసిల్దార్ ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. నడికూడలో నిర్మాణంలో ఉన్న పాల శీతలీకరణ కేంద్రం భవనం పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. ధర్మారం–నడికూడ మధ్య కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని కలెక్టర్ పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రామకృష్ణ, ఇతర శాఖల అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.