Hanumakonda: ఎంపీల్యాడ్స్ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి!
Hanumakonda: ఎంపీల్యాడ్స్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశం. కలెక్టరేట్‌లో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష.
Hanumakonda: ఎంపీల్యాడ్స్ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి!
హనుమకొండ: ఎంపీల్యాడ్స్ నిధులతో జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్ )ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, టీజీఐడీసీ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతి గురించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులలో పురోగతిలో ఉన్నవాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు.
మిగతా అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. వారం రోజుల్లో ఎంపీల్యాడ్స్ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ దేవిక చౌహాన్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గాయత్రి, పంచాయతీరాజ్ ఈఈ రాజగోపాల్ రావు, డీఈలు శ్రీనివాస రావు, శిరీష, యుగంధర్, రామ్ దేవ్, కన్సల్టెంట్ టెక్నీకల్ నరేందర్ రెడ్డి, టీజీఐడీసీ ఏఈ ఎండీ. అజీజ్ ఖాన్, పంచాయతీ రాజ్ ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




