Hanumakonda: మోడల్ సోలార్ గ్రామాల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్!
Hanumakonda: పీఎం సూర్య ఘర్ కింద హన్మకొండ జిల్లా ఆత్మకూర్, కేశవాపురంలో సోలార్ ప్యానెల్స్, మీటర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు.
Hanumakonda: మోడల్ సోలార్ గ్రామాల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్!
Hanumakonda: పీ . యం . సూర్య ఘర్ పథకం కింద మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపికైన ఆత్మకూర్, కేశవాపురం గ్రామాల్లో ప్రతి ఇంటికి సోలార్ పానల్స్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి రెడ్కో, NPDCL అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరెట్ లోని మినీ కాన్ఫెరెన్స్ హాల్ లో రెడ్ కో, NPDCl
అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... మోడల్ సోలార్ గ్రామాల్లో వ్యవసాయ బావులకు కూడా ఈ పథకం కింద విద్యుత్ త్వరితగతిన అందించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పక్కాగా పూర్తి చేసి... తొందరగా విద్యుత్ సర్వేసులను విడుదల చేయాలన్నారు
అలాగే PM KUSUM పథకం కింద రైతుల భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే పనుల పురోగతిపై కూడా చర్చించారు. EV చార్జింగ్ స్టేషన్ ల గురించి చర్చించి వాటిని కుడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశం లో se NPDCl సామ్య నాయక్, రెడ్ కో జిల్లా మేనేజర్ రాజేందర్, డి ఈ, ఏ ఈ లు పాల్గొన్నారు.




