Hanumakonda: హన్మకొండలో రాజీవ్ గాంధీకి ఎమ్మెల్యే నాగరాజు నివాళి!

Hanumakonda: హన్మకొండ డిసిసి భవన్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 20 Aug 2026 1:27 PM IST
Hanumakonda
X

Hanumakonda: హన్మకొండలో రాజీవ్ గాంధీకి ఎమ్మెల్యే నాగరాజు నివాళి!

Hanumakonda: భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని గురువారం హన్మకొండ డీసీసీ భవన్ లో ఆయన చిత్ర పటానికి డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి గారు,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గార్లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు పూలమాల వేసి నివాళి అర్పించారు.

అనంతరం వరంగల్ జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజిఎం సెంటర్ లోని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ,హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి గార్లతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆధునిక భారతదేశ అభివృద్ధి, ఐటీ అభివృద్ధికి పునాది వేసిన గొప్ప వ్యక్తి రాజీవ్‌గాంధీ అని అన్నారు. యువతకు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించారని,రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.దేశం కోసం ఇందిరా గాంధీ తర్వాత రాజీవ్‌ గాంధీని సైతం కోల్పోయిన గాంధీ కుటుంబం ఇప్పటికి దేశం కోసం పని చేస్తున్నదని అన్నారు. దేశంలో రాజీవ్‌ గాంధీ హాయంలో అనేక అభివృద్ధి జరిగిందన్నారు. పేదలకు కూడు గూడు, గుడ్డ అందించాలని పరితపించారన్నారు.18ఏళ్ళు నిండిన యువకులకు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు ఫారాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర, నియోజకవర్గ,ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,డివిజన్ అధ్యక్షులు,సర్పంచులు,పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story