Parkal: అంగన్‌వాడీల్లో పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
Parkal: పరకాల అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల పోషకాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.
Parkal: అంగన్‌వాడీల్లో పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
హనుమకొండ జిల్లా: పరకాల అంగన్‌వాడీ కేంద్రాలలో పోషకాహారం, బాలల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
పరకాల ఆర్.ఆర్ గార్డెన్స్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో కేవలం అన్నంపైనే దృష్టి ఉండేదని, ఇప్పుడు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లతో కూడిన పోషకాహారంపై అవగాహన పెరిగిందని అన్నారు. జిల్లాలో SAM, MAM కేసులు తగ్గాయని, వాటిని జీరోకు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. బాలామృతాన్ని లడ్డూలు, కేకుల రూపంలో పిల్లలకు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, ఆర్డీవో డీఎస్ వెంకన్న పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, టీచర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసనలు నిర్వహించారు.




