Hanumakonda: పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
Hanumakonda: హన్మకొండ జిల్లా పరకాలలో ఈనెల 16న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు.
Hanumakonda: పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
హన్మకొండ: పరకాల లో ఈ నెల 16 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన లో భాగంగా సభ ఏర్పాట్ల ను పరిశీలించిన మంత్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,వరంగల్ ఎంపీ కడియం కావ్య,స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి,ఎమ్మెల్యేలు కె ఆర్ నాగరాజు ,నాయిని రాజేందర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ చాహాత్ భాజ్ పాయి వరంగల్ జిల్లా సిపి శ్వేత.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం లోని పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు గంటలకు వస్తున్నారు. దాదాపు 400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
సుమారు 70000 జనాభా ముఖ్యమంత్రి సభకి హాజరవుతారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగు లేకపోయినా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని ఆపలేదు. ఆనాటి ప్రభుత్వం పునాదిరాళ్లు వేస్తే శిలాఫలకాలికే పరిమితమైతే వాటిని తొలగించకుండా వాటి స్థానంలోని వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేశామన్నారు.
నియోజకవర్గానికి 5500 ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చామన్నారు. ఇప్పటికే రెండవ విడుదల ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చామని భవిష్యత్తులో మరో రెండు విడుదల ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామన్నారు. స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి సభకు విచ్చేస్తున్న ప్రజలకు స్వాగతం తెలిపారు.




