Hanumakonda: నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం - మంత్రి పొంగులేటి హాజరు
Hanumakonda: హనుమకొండలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Hanumakonda: నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం - మంత్రి పొంగులేటి హాజరు
హనుమకొండ: హనుమకొండ అదాలత్ సర్కిల్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద, హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతుండగా, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
గురువారం ఉదయం 9 గంటల 48 నిమిషాలకు అదాలత్ సర్కిల్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని అమరులకు రాష్ట్రమంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు నివాళులు ఘటించనున్నారు
అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జరిగే ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండా ను ఆవిష్కరించి సందేశం ఇవ్వనున్నారు




