Bhupalpally: డీటీఓ వెంకన్న మృతి.. నల్ల బ్యాడ్జీలతో నివాళులర్పించిన ఆర్టీఓ సిబ్బంది!

Bhupalpally: భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) వెంకన్న అకాల మరణం పట్ల హనుమకొండ ఆర్టీఓ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

AJAY, HANMAKONDA
Published on: 22 Jun 2026 12:29 PM IST
Bhupalpally
X

Bhupalpally: డీటీఓ వెంకన్న మృతి.. నల్ల బ్యాడ్జీలతో నివాళులర్పించిన ఆర్టీఓ సిబ్బంది!

Bhupalpally: భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న అకాల మరణం పట్ల హనుమకొండ ఆర్టీఓ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి తమ సంతాపాన్ని తెలియజేశారు.

కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డీటీఓ వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, డీటీఓగా వెంకన్న సేవలు ఎంతో ప్రశంసనీయమని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అధికారిని కోల్పోవడం రవాణా శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story