Hanumkonda: హనుమకొండలో ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షా కేంద్రాల పరిశీలన!

Hanumkonda: హనుమకొండలో ఆదివారం జరిగే ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షల కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఎన్. రవి. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు ఆదేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 12 Sept 2026 5:04 PM IST
Hanumkonda
X

Hanumkonda: హనుమకొండలో ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షా కేంద్రాల పరిశీలన!

Hanumkonda: హనుమకొండ జిల్లాలో ఈ నెల 13న(ఆదివారం)జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ (ఎన్‌డీఏ, ఎన్‌ఏ)-2, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్)-2 పరీక్షలను నిర్వహించే పరీక్షా కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి శనివారం పరిశీలించారు.

హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి బాలికల డిగ్రీ, పీజీ కళాశాలలను అదనపు కలెక్టర్ రవి, కేంద్ర పరిశీలకులు ఉమేష్ కుమార్ మీనా సందర్శించి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

పరీక్షా గదులు, అభ్యర్థులకు కల్పిస్తున్న తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ తదితర ఏర్పాట్లను వారు పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా జరిగేవిధంగా బాధ్యతలు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి,అడిషనల్ తహసీల్దార్లు రవి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.