Hanamkonda: హెచ్‌సీఎల్ 'టెక్ బీ' మెగా జాబ్ డ్రైవ్ ఇంటర్ అభ్యర్థులకు అవకాశం!
Hanamkonda: ఆగస్టు 25న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 'టెక్ బీ' ప్రోగ్రామ్ మెగా జాబ్ డ్రైవ్. ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో పాటు డిగ్రీ చదివే అవకాశం.
Hanamkonda: హెచ్‌సీఎల్ 'టెక్ బీ' మెగా జాబ్ డ్రైవ్ ఇంటర్ అభ్యర్థులకు అవకాశం!
Hanamkonda: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు "హెచ్ సీ ఎల్ టెక్నాలజీ" వారు నిర్వహిస్తున్న "టెక్ బీ ప్రోగ్రాం" కోసం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి గోపాల్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 25th 2026 (మంగళవారం) సమయం: ఉదయం 11:30 గంటలకు హన్మకొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఐసీఎస్సెస్ కంప్యూటర్ కేంద్రంలో అర్హత పరీక్ష నిర్వహించబడును.
ఈ ఎంపికకు గాను 2025-2026 విద్యా సం. లో MPC, జనరల్, ఒకేషనల్ ఏ గ్రూపులో ఇంటర్ పూర్తి చేసినా అర్హులే. ఇంటర్ పరీక్షల్లో 75 % మార్కులుంటే చాలు. టెక్-బీ ప్రోగ్రాంలో ఎంపికయిన వారికి "సాఫ్ట్ వేర్" ఉద్యోగం తో పాటు డిగ్రీ కూడా పూర్తి చేసుకోవచ్చు. జీతం సం. నికి 2.2 నుండి 2.5 లక్షలుంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాల్సిన సర్టిఫికేట్లు
పదవతరగతి, ఇంటర్ ఉత్తీర్ణత, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ ఫోటో, ఆండ్రాయిడ్ మొబైల్. మరిన్ని వివరాలకు జిల్లా ఇంఛార్జ్ నరేష్ (7569177071 / 79818 34205 ) ను సంప్రదించవచ్చు.




