Hanamkonda: పరకాలలో అంగన్‌వాడీ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన!
Hanamkonda: హనుమకొండ జిల్లా పరకాలలో అంగన్‌వాడీ టీచర్ పోస్టుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహణ; ఒక్క పోస్టుకు 120 మంది దరఖాస్తు చేసుకోవడంతో తీవ్ర పోటీ.
Hanamkonda: పరకాలలో అంగన్‌వాడీ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన!
Hanamkonda: పాత మున్సిపాలిటీ పరిధిలో అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. పరకాల నియోజకవర్గ పరిధిలో మొత్తం 13 అంగన్‌వాడీ పోస్టులకు గాను 450 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, పరకాల పట్టణానికి కేటాయించిన ఒక్క పోస్టుకు 120 మంది మహిళలు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేశారు. అభ్యర్థుల విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.




