Jangaon: జనగాం జిల్లాలో జోరు వానలు - ఉప్పొంగుతున్న వాగులు!
Jangaon: జనగాం జిల్లా నర్మెట్ట, రఘునాథపల్లి మండలాల్లో వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు.
Jangaon: జనగాం జిల్లాలో జోరు వానలు - ఉప్పొంగుతున్న వాగులు!
Jangaon: నర్మెట్ట మండలంలో మచ్చుపాడు మంగల్ బండ తండ పలు గ్రామాలలో రఘునాథ్ పల్లి మండల్ లో మంగలి బండ తండా ఆంధ్ర తండా మేకల గట్టు పలు గ్రామాలలో ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో మండల కేంద్రం నుంచి వెళ్లే ప్రధాన రహదారిపై వాగు ఉప్పొంగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాగు ఉద్ధృతి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.




