Mahabubabad: సీరోల్‌లో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్లతో భయాందోళనలో గ్రామస్తులు.
Mahabubabad: సీరోల్‌లో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా సీరోల్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు.
తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు గ్రామం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అధిక వేగంతో, ఓవర్‌లోడ్‌తో ట్రాక్టర్లను నడుపుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు స్పందించకపోతే ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేశారు.




