Hanamkonda: బాలల సంరక్షణ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ శేషాద్రి ఆకస్మిక తనిఖీలు!

Hanamkonda: హనుమకొండ జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ బాలల సంరక్షణ కేంద్రాలను ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 22 Aug 2026 5:37 PM IST
Hanamkonda
X

Hanamkonda: బాలల సంరక్షణ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ శేషాద్రి ఆకస్మిక తనిఖీలు!

హనుమకొండ: బాలల రక్షణ, సంరక్షణ కోసం కృషి చేయాలని హనుమకొండ జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి అన్నారు. శనివారం హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్) ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి తనిఖీ చేశారు.

జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులతో కలిసి కరుణాపురం లోని కరుణాలయం బాయ్స్ అండ్ గర్ల్స్, ఫాతిమానగర్ లో డివైన్ మెర్సీ, రెవెన్యూ కాలనీ లోని ఒయాసిస్ ఓపెన్ షెల్టర్ ఫర్ బాయ్స్, సుబేదారి లోని ప్రభుత్వ బాలికా సదనం, అసుంత ఆశా నిలయం, సర్క్యూట్ గెస్ట్ హౌజ్ రోడ్ స్పందన మానసిక దివ్యాంగుల కేంద్రం, వడ్డేపల్లి లోని బోగవెల్లి రాజేశ్వర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ( ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ) కేంద్రాలను తనిఖీ చేసారు,

ఈ సందర్బంగా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల మేరకు కనీస ప్రమాణాలు పాటించాలని, ముఖ్యంగా భవనాలకు సంబంధించిన సౌండ్నెస్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లను కలిగి ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటేషన్, వాటర్ ప్యూరిఫికేశన్ సంబంధిత, కిచెన్, స్టోర్ , విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు, ఈ సందర్భంగా తనిఖీ చేసిన కేంద్రాలలో డార్మెటరీ, వాష్ రూమ్స్, డైనింగ్ హాల్, పరిసరాలను పరిశీలించారు, రికార్డులను, పిల్లలకు అందిస్తున్న ఆరోగ్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

లైసెన్స్ కలిగి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకొనే సంస్థలు తప్పకుండా కనీస ప్రమాణాలు పాటించాలని లేనిచో నిబంధనల మేరకు చర్యలుంటాయని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ఎం.విశ్వజ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకోసారి బాలల సంరక్షణ కేంద్రాలను కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేస్తామని, నెలకో సారి, సంబంధిత శాఖ అధికారులు మరియు ఐసీడీఎస్ సిడిపివో సూపర్వైజర్ ఆధ్వర్యంలో వార వారం తనిఖీ చేస్తామని ఇందులో భాగంగా కనీస ప్రమాణాలను పాటించేలా తగు సూచనలు, జాగ్రత్తలు తెలియచేసి తదనుగుణంగా నడుచుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సిహెచ్. అవంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కజాంపురం దామోదర్, ఇన్చార్జి డిసిపిఓ ఎస్ ప్రవీణ్ కుమార్, జిల్లా తనిఖీ బృందం సభ్యులు ఎర్ర శ్రీకాంత్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story