Mahabubabad: మహబూబాబాద్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ!

Mahabubabad: మహబూబాబాద్‌లో బీజేపీ వ్యతిరేకుల ఓట్ల తొలగింపును నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 6 Oct 2026 6:35 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ , వామపక్ష పార్టీ ల శ్రేణులు భారీ ర్యాలీ తో కలెక్టరేట్ కు చేరుకొని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ , కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి నేతలు మాట్లాడుతూ దేశం లో స్వచ్ఛందంగా పనిచేయవలసిన ఎన్నికల కమిషన్ బిజెపికి తొత్తుగా మారి బిజెపి వ్యతిరేకుల ఓట్ల ను తొలగిస్తున్నారని , దేశం లో 13 కోట్ల ఓట్లను , తెలంగాణలో 90 లక్షల ఓట్లను తొలగించారని , చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దేశ ద్రోహి అని విమర్శించారు.వెంటనే సర్ ప్రక్రియను నిలిపివేసి , ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని , బ్యాలెట్ పేపర్ ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నా కార్యక్రమం లో కాంగ్రెస్ , సిపిఐ , సిపిఎం , న్యూడెమోక్రసీ , న్యూడెమోక్రసీ మాస్ లైన్ పార్టీల నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad