Jangaon: స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం!

Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ప్రారంభించారు.

V Ravikiran, Jangaon
Published on: 21 Nov 2026 7:01 AM IST
Jangaon
X

Jangaon: స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం!

Jangaon: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆపద సమయంలో అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా పథకం అమలు, అర్హుల నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల బీమా పరిహారం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.కుటుంబానికి భరోసా కల్పించే ఇటువంటి బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం అభినందనీయమని అన్నారు.

అర్హత కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకంలో నమోదు చేసుకొని ప్రభుత్వ బీమా భరోసాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అర్హులైన కుటుంబాలకు పథకంపై అవగాహన కల్పించాలని, నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని చైర్మన్ వినయ్ కుమార్ అధికారులకు సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమాచారం అందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, ఇన్‌చార్జి శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీను, మేనేజర్ సత్యం, సీనియర్ అసిస్టెంట్ లింగయ్య, జూనియర్ అసిస్టెంట్లు మధు, సందీప్, జూనియర్ అకౌంటెంట్ లత, వార్డు ఆఫీసర్ బేతయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon