Mahabubabad: ఐఆర్‌సీటీసీ ‘దివ్య దర్శన్ యాత్ర’ల షెడ్యూల్ విడుదల

Mahabubabad: తెలుగు రాష్ట్రాల యాattributeత్రీకుల కోసం రైల్వే శాఖ 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను' అందుబాటులోకి తెచ్చింది.

A.Rajkumar, Mahabubabad
Published on: 20 May 2026 5:13 PM IST
Mahabubabad
X

Mahabubabad: ఐఆర్‌సీటీసీ ‘దివ్య దర్శన్ యాత్ర’ల షెడ్యూల్ విడుదల

Mahabubabad: తీర్థయాత్రలకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం రైల్వే శాఖ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ లను ప్రారంభించిందని తెలుగు ప్రజలంతా దీనిని ఉపయోగించుకోవాలని ఐ.ఆర్.సి. టి.సి, టూరిజం అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో టూరిజం రైళ్ల వివరాలను ఆయన వెల్లడించారు.

మే 24 నుంచి జూలై 13 వరకు దివ్య దర్శన్ యాత్రల పేరుతో 3 యాత్రలు ఉంటాయని , మే 24 న అరుణాచలం, చిదంబరం , జూన్ 16 నుంచి 26 వ తేదీ వరకు జ్యోతిర్లింగ దర్శన యాత్ర, జులై 4 నుంచి 13 వ తేదీ వరకు పూరి, కోణార్క్, బైద్యనాథ్, అయోధ్య, కాశీ యాత్రలు ఉంటాయని, ఈ యాత్రలలో 3 కేటగిరీలు ఉంటాయని, టీ, టిఫిన్, భోజనం, డిన్నర్, బస, ప్రతి 70 మంది యాత్రికులకు 2 రు గైడ్ లు ఉంటారని, టూరిస్ట్ ట్రైన్ లో ఉండే 700 యాత్రికులకు రైల్లోనే భోజనం వండి, వడ్డిస్తారని,

ఇవే కాక ప్రతి వారం షిరిడి, తిరుపతి, ఊటీ, కొడైకెనాల్ తదితర యాత్రలు ఉంటాయని ప్రజలంతా వీటిని ఉపయోగించుకోవాలని, పూర్తి వివరాల కోసం ఈ నెంబర్లు 040..27702407, 9701360701 లను సంప్రదించాలని కోరారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story