Warangal: కాంగ్రెస్‌లో 30 ఏళ్లు కష్టపడితే గుర్తింపు లేదు: జనసేన నేత!
Warangal: వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట నడుస్తోందని జనసేన నాయకుడు కరాటే ప్రభాకర్ విమర్శించారు.
Warangal: కాంగ్రెస్‌లో 30 ఏళ్లు కష్టపడితే గుర్తింపు లేదు: జనసేన నేత!
వరంగల్ జిల్లా: వరంగల్ జనసేన పార్టీ నాయకులు కరాటే ప్రభాకర్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు ప్రభాకర్ కామెంట్స్ వరంగల్ గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో కృషి చేశాను. ఎన్నో విడుదలకు ఓర్చుకున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంతగానో కష్టపడ్డాను. కానీ వరంగల్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ తూర్పులో మూడు ముక్కలాట అయిపోయింది.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి పదవి ఇస్తే కనీస గౌరవం, గుర్తింపు లేకుండా కొందరు చేస్తున్నారు. తూర్పులో వచ్చిన పదవులను నీకు ఒకటి నాకు ఒకటి అనే సినిమా టికెట్ల లాగా పంచుకుంటున్నారు. నన్ను ఎన్నో విధాల ఒత్తిళ్లకు గురి చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ తూర్పులో జనసేన పార్టీలకు చాలామంది రానున్నారు.
పవన్ కళ్యాణ్ కోసం పార్టీలోకి రాలేదు, పవన్ కళ్యాణ్ యొక్క పేదలకు మంచి చేయాలని దృక్పథం ఉంది కాబట్టి వచ్చాను జనసేన పార్టీ అధిష్టానం నాకు పార్టీలో ఏ బాధ్యతలో అప్పజెప్పిన దానికి కట్టుబడి ఉండి పార్టీ బలోపేతం కోసం కష్టపడతాను, పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తాను.




