Jangaon: సిద్ధయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు: నిందితుడు అరెస్ట్!

Jangaon: జనగామ బచ్చన్నపేట మండలం కొడవటూరుకు చెందిన సిద్ధయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. చేతబడి అనుమానంతో హత్య చేసిన సవతి సోదరుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 3 Nov 2026 11:30 PM IST
Jangaon
X

Jangaon: సిద్ధయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు: నిందితుడు అరెస్ట్!

జనగామ: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామానికి చెందిన మిన్నలాపురం సిద్ధయ్య ఈ నెల 23వ తేదీ మృతి చెందిన కేసును పోలీస్ లు చేధించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తులో నేరానికి పాల్పడిన సవతి తల్లి కొడుకు శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఏసీపీ భీమ్ శర్మ మాట్లాడుతూ.. శ్రీనివాస్ కుటుంబంలో జరిగిన మరణాలకు సిద్ధయ్య చేతబడి చేయడమే కారణమని మూఢనమ్మకంతో హత్య చేసినట్లు వెల్లడించారు. నేరానికి ఉపయోగించిన స్కూటీ, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

హత్య కేసును చేదించిన పోలీసులను సిపి శ్వేత అభినందించినట్లు ఏసిపి తెలియజేశారు. ప్రజలు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, అనారోగ్య సమస్యలకు అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలని, హింసకు పాల్పడవద్దని పోలీసులు సూచించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON