Jangaon: బాణాపురంలో వైభవంగా మహా సుదర్శన యాగం: చిన్న జీయర్ స్వామి!
Jangaon: జనగామ బాణాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో తృతీయ పుష్కర మహోత్సవాలు, పంచకుండాత్మక మహా సుదర్శన యాగం వైభవంగా నిర్వహణ.
Jangaon: బాణాపురంలో వైభవంగా మహా సుదర్శన యాగం: చిన్న జీయర్ స్వామి!
Jangaon: జనగామ బాణాపురం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి ఆధ్వర్యంలో అత్యంత వైభవముగా భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న తృతీయ పుష్కర మహోత్సవములు, మహా సుదర్శన యాగ ప్రయుక్తముగా జరుగుతున్న వేడుకలలో భాగంగా వెంకటేశ్వర స్వామికి విశేష సహస్ర నామార్చన సిద్ధాంతి నిర్వహించారు. అనంతరము చిన్న జీయర్ స్వామి వారి ఆరాధ్య దైవము కోదండరాముడికి జీయర్ స్వామి వారి విశేష ఆరాధనని నిర్వహించి వారి చేతుల మీదుగా భక్తులందరికీ తీర్ధ వితరణ చేశారు.
అనంతరము యాగశాలలో పంచకుండాత్మకముగా ఐదు కుండములలో సుదర్శన హవనాన్ని నిర్వహించారు 60 సంవత్సరములు పైబడిన వారందరికీ ఉగ్రరథ భీమరథ ఐంద్రీ సహస్ర చంద్ర దర్శన విశేష హవనములు శేష ఆరాధనలు జరిపించారు. ఈ రోజు పూజలో పాల్గొన్న వంద మంది దంపతుల చేత దంపతీ పూజలు జరిపించారు. ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ భక్తి యొక్క వైశిష్ట్యాన్ని తెలిపారు. నక్షత్రాలు తిధులు, వారాలు, కాలం మనకు అనుకూలంగా ఉండేందుకు మన పూర్వీకులు అందించిన సాంప్రదాయాలు పాటించాలని సూచించారు. మన సాంప్రదాయాలె మనకు శ్రీరామ రక్ష అని అన్నారు.
భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను బాగా జరుపుకుందాం అని అందరికీ మంగళ శాసనం చేశారు. పుర ప్రముఖులు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, వేదపండితులు పాల్గొని నిర్వహించిన ఈ రోజు కార్యక్రమంలో వృద్ధ దంపతులు అనేక మంది తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. కుటుంబ వ్యవస్థలో పెద్దలను గౌరవించే ప్రక్రియ యువతరానికి అందించడం ఆనందదాయకమని పలువురు అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ రోజు కూడా పూజలో పాల్గొన్న వారి తో పాటు వేడుకలో పాల్గొన్న వందలాదిమంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.




