Jangaon: కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై నిరసన - బీఆర్‌ఎస్ నాయకుల అరెస్ట్

Jangaon: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ జనగామలో బీఆర్‌ఎస్ నాయకులు చేపట్టిన ఆందోళనను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 7 Sept 2026 4:21 PM IST
Jangaon
X

Jangaon: కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై నిరసన - బీఆర్‌ఎస్ నాయకుల అరెస్ట్

జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల చొక్కలు ధరించి అసెంబ్లీకి బయలుదేరిన సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను ఖండిస్తూ జనగామలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు.

జనగామ బస్టాండ్ సెంటర్‌లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం కూడా బీఆర్‌ఎస్ నాయకులు వెనక్కి తగ్గకుండా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story