Jangaon: ఉప్పుగల్లు రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నాయకుల నిరసన పిండప్రదానం

Jangaon: జనగామ ఉప్పుగల్లు రిజర్వాయర్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. దేవాదుల హామీలపై పిండప్రదానం చేసి, రైతు రణభేరి నిర్వహించారు.

V Ravikiran, Jangaon
Published on: 3 Sept 2026 7:33 PM IST
Jangaon
X

Jangaon: ఉప్పుగల్లు రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నాయకుల నిరసన పిండప్రదానం

జనగామ: జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లు రిజర్వాయర్ ప్రధాన కాలువను పరిశీలించారు. 33 నెలలు ఎమ్మెల్యేగా ఎన్నికైన కడియం శ్రీహరి ఒక్క ఎకరాకు సాగునీరు అందివ్వలేదని ఆరోపిస్తూ నీరనగా, ఉప్పుగల్లుకు ఒక్క పైసా ఇవ్వని ఎంపీ కడియం కావ్యకు నిరసనగా, దేవాదుల పనులను పూర్తి చేస్తానని మాయ మాటలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నిరసనగా రిజర్వాయర్ వద్ద పిండాలు పెట్టారు.

జిల్లాలో దేవాదుల పనులను సంవత్సరంలో పూర్తి చేస్తామని ఒకసారి, సంవత్సరం నరలో పూర్తి చేస్తామని మరోసారి చెప్పిన రేవంత్ రెడ్డి , 6 గురు మంత్రులతో వచ్చి మళ్లీ ఇప్పుడు జూన్ వరకు పూర్తి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా రైతు రణభేరి సభను నిర్వహించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తో పాటు నాగూర్ల వెంకన్న పాల్గొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలు చేయడంలో విఫలమై ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon