Jangaon: హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై రక్తసిక్తం!
Jangaon: జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి బైపాస్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Jangaon: హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై రక్తసిక్తం!
జనగాం జిల్లా: జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై జనగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కారు బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఈ ఘటనలో మాణిక్య పురం గ్రామానికి చెందిన రాములు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




