Jangaon: డిజిటల్ దిశగా జనగణన.. మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం!

Jangaon: జనగణన-2027: స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియ ప్రారంభం. మే 10 వరకు కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం.

MD AHMAD PASHA, JANGAON
Published on: 26 April 2026 2:05 PM IST
Jangaon
X

Jangaon: డిజిటల్ దిశగా జనగణన.. మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం!

Jangaon: జిల్లాలో జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియకు నేటి నుండి అవకాశం కల్పించిన్నట్లు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబ వివరాలను స్వయంగా ఆన్లైన్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జనగణన-2027లో భాగంగా ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు నిర్వహించనున్న స్వీయ గణనపై.. ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముందుగా

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా స్వీయ గణన నమోదు ప్రక్రియ పైన మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..... స్వీయ గణన ప్రక్రియ నేటి నుండి 10 మే 2026 వరకు అందుబాటులో ఉంటుందని.. ఈ కాలంలో ప్రజలు తమ ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, సౌకర్యాలు మొదలైన అంశాలను అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా సులభంగా నమోదు చేయవచ్చన్నారు. ఈసారి జనగణనలో మొదటిసారిగా స్వీయ గణనను ప్రవేశపెట్టడం జరిగిందని, ఇది దేశాన్ని డిజిటల్ దిశగా తీసుకెళ్లే ముఖ్యమైన అడుగు అని తెలిపారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story