Jangaon: జనగామ అతిథి గురుకులంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
Jangaon: జనగామ అతిథి గురుకులంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపిన మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి. విద్యార్థులకు దీపావళి టపాకాయలు పంపిణీ.
Jangaon: జనగామ అతిథి గురుకులంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
జనగామ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జనగామలోని అతిథి గురుకులంలో చిన్నారుల సమక్షంలో జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి&శ్రీ కడకంచి బాలమణి-శ్రీనివాస్ గారు జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.
అలాగే చిన్నారులతో కొంత సమయం గడిపి వారికి దీపావళి సందర్బంగా టపాకాయలు అందించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మంచి విద్య, నాణ్యమైన వసతులు అందించి ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




