Jangaon: జనగామ కలెక్టర్‌పై విమర్శలను తిప్పికొట్టిన కేవీఎల్ఎన్ రెడ్డి
Jangaon: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ ఝాపై ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి కొంతమంది ఫిర్యాదు చేయడంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీఎల్ఎన్ రెడ్డి మండిపడ్డారు.
Jangaon: జనగామ కలెక్టర్‌పై విమర్శలను తిప్పికొట్టిన కేవీఎల్ఎన్ రెడ్డి
Jangaon: జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై కొంత మంది ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిర్యాదు చేయడం పై బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు KVLN రెడ్డి సీరియస్. ప్రజలకు మంచి సేవ చేసే కలెక్టర్ వస్తె జీర్ణించుకోలేని కుహానా లౌకిక వాదులు. కొంత మంది వ్యక్తిగత లాభాల కోసం కలెక్టర్ మీద లేని పోనీ నిందలు వేయడం కరెక్ట్ కాదు.
రోజు పైరవీలు చేసుకునే కొంత మంది ఇప్పుడు వాళ్ళకు ఎలాంటి పైరవీలు నడవక పోవడంతో కలెక్టర్ పై పిర్యాదు చేస్తున్నారు. రౌండ్ టేబుల సమావేశం అంటే ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అన్ని పార్టీలు కలిసి పెడితే రౌండ్ టేబుల్ సమావేశం అంటారు. ఈ కలెక్టర్ వచ్చిన తర్వాత నే జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు అందరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
కొంత మందితో సాదిక్ అలీ అనే వ్యక్తి కలిసి ఒక మంచి కలెక్టర్ పై ఇంచార్జ్ మంత్రికి పిర్యాదు చేయడం సిగ్గుచేటు. కలెక్టర్ అవినీతి చేసినట్టు ఐతే అందరం కలిసి పోరాడుదాం అంతే కానీ బూటకపు మాటలు మాట్లాడొద్దు.




