Jangaon: జనగామలో పారదర్శకంగా అవుట్‌సోర్సింగ్ నియామక పరీక్షలు

Jangaon: జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అవుట్‌సోర్సింగ్ నియామక పరీక్షలను పరిశీలించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 3 July 2026 7:20 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో పారదర్శకంగా అవుట్‌సోర్సింగ్ నియామక పరీక్షలు

Jangaon: జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా అవుట్‌సోర్సింగ్ కమిటీ ఛైర్మన్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన నియామక పరీక్షల సరళిని శుక్రవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగిందన్నారు. జూలై 2న వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి AEO పోస్టుల భర్తీకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించామన్నారు.

జూలై 3న వైద్య శాఖకు సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్, ఎస్‌టీఎల్‌ఎస్ STLS పోస్టుల కోసం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించగా, అనంతరం విద్యా శాఖకు సంబంధించిన TGSWREISలో పార్ట్‌ టైమ్ టీచర్ల పోస్టుల కోసం మధ్యాహ్నం 1 గంటల నుంచి 2.30 గంటల వరకు పరీక్షను నిర్వహించినట్లు స్పష్టం చేశారు.

హాజరు వివరాలు ఇలా ఉన్నాయి:

వ్యవసాయ శాఖ – AEO పోస్టులు: 111 మంది దరఖాస్తు చేయగా 94 మంది పరీక్షకు హాజరయ్యారు.

వైద్య శాఖ – ల్యాబ్ టెక్నీషియన్ & STLS పోస్టులు: 100 మంది దరఖాస్తు చేయగా 75 మంది పరీక్షకు హాజరయ్యారు.

సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థల పార్ట్‌ టైమ్ టీచర్ పోస్టులు: 100 మంది దరఖాస్తు చేయగా 82 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story