Jangaon: ఇంధన నిల్వలపై నిఘా.. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు!

Jangaon: జనగామ జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 28 April 2026 3:59 PM IST
Jangaon
X

Jangaon: ఇంధన నిల్వలపై నిఘా.. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు!

Jangaon: ప్రజలు అపోహలకు లోను కాకుండా, సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం( పెట్రోల్, డీజిల్ )కొనుగోలు చేయాలని, అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో తనిఖీ లు నిర్వహించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.

జిల్లా లో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వల అంశం మీద మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో మినీ కాన్ఫెరెన్స్ హల్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రివ్యూ నిర్వహించారు

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..

జిల్లా లో ఉన్న అన్నీ బంకుల్లో తహసీల్దార్, సివిల్ సప్ప్లై, పోలీస్, లీగల్ మెట్రాలాజి శాఖల అధికారులు, జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఉన్న నిల్వలని పరిశీలించాలన్నారు. పెట్రోల్, డీజిల్ ఉన్నప్పటికీ స్టాక్ లేదని బోర్డు పెట్టిన బంక్ యజమానుల మీద చర్యలు తీసుకోవాలన్నారు.

పెట్రోల్ బంకుల్లో సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

ఎక్కడైనా పెట్రోల్, డీజిల్ కొరత ఉంటే 1800 425 00 333 టోల్ ఫ్రీ నెంబర్ కి అలాగే రాష్ట్ర విపత్తుల హెల్ప్ లైన్ 1077 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు ముందస్తు గా క్యాన్ లలో ఎక్కువ మొత్తం లో పెట్రోల్, డీజిల్ ని తీసుకెళ్ళకుండా చూడాలన్నారు.

ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ బెన్ షాలోం, జనగాం, స్టేషన్ ఘనపూర్ ఆర్డివో లు గోపిరామ్, వెంకన్న, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్,వ్యవసాయ, ఆరోగ్య, విద్య, వైద్య, సంక్షేమ శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story