Jangaon: జనగామలో వన మహోత్సవం ప్రారంభం.. మొక్కలు నాటిన కలెక్టర్!

Jangaon: జనగామ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గురుకుల పాఠశాలలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

MD AHMAD PASHA, JANGAON
Published on: 18 Jun 2026 9:28 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో వన మహోత్సవం ప్రారంభం.. మొక్కలు నాటిన కలెక్టర్!

Jangaon: అటవీ పెంపకాన్ని ప్రోత్సహించడానికి అలాగే పర్యావరణ పరిరక్షణ కై ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

గురువారం స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల లో వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మొక్కలను నాటారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యత గా మొక్కలను నాటలని పిలుపు నిచ్చారు. భావితరాలకు సహజ సిద్ధమైన వాయువును అందించేందుకు అటవీ విస్తీర్ణాన్ని పెంచడం మరియు గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించెందుకు ప్రారంభం అయిన వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లా లో వివిధ శాఖల అధికారులు తమ లక్ష్యాలను వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేసారు.

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, విద్యార్థులు కూడా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం లో వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story