Jangaon: జనగామ కలెక్టరేట్‌లో రూ.37.85 లక్షలు స్వాహా!

Jangaon: జనగామ కలెక్టరేట్ ఖాతా నుంచి రూ.37.85 లక్షల ప్రజాధనం అపహరణకు గురికావడంతో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 20 July 2026 7:51 AM IST
Jangaon
X

Jangaon: జనగామ కలెక్టరేట్‌లో రూ.37.85 లక్షలు స్వాహా!

Jangaon: జనగామ జిల్లా కలెక్టరేట్ ఖాతా నుంచి రూ.37,85,050 ప్రజాధనం అపహరణకు గురైనట్లు అంతర్గత తనిఖీలో వెలుగులోకి వచ్చింది. ట్రెజరీ వెలుపల ప్రైవేటు బ్యాంకులో ఉన్న ఖాతా నుంచి అసలు సరఫరా కాని ఫర్నిచర్, కంప్యూటర్ల పేరిట నకిలీ బిల్లులతో 2026 ఫిబ్రవరిలో ఒకే రోజున సొమ్ము బదిలీ చేశారు. భౌతిక తనిఖీలో ఒక్క వస్తువు కూడా లభించలేదు.

ఈ ఘటనపై ముగ్గురు కలెక్టరేట్ ఉద్యోగులను సస్పెండ్ చేసి, శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. జనగామ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం.387/2026 నమోదై దర్యాప్తు జరుగుతోంది.

ఇదే తరహాలో "దిక్సూచి" పుస్తకాల పేరిట రూ.46.50 లక్షలు దుర్వినియోగమైన ఘటనను కూడా జిల్లా యంత్రాంగం ఇప్పటికే గుర్తించింది. మొత్తంగా కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగంపై లోతైన దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రజాధనంలో ప్రతి పైసా తిరిగి రాబడతామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story