Jangaon: జనగామలో SIR ఫారాలపై ప్రజలకు అవగాహన

Jangaon: జనగామ ఏక్ మినార్ మసీదులో జుమ్మా నమాజ్ అనంతరం SIR ఫారాల ప్రక్రియపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మహమ్మద్ జమాల్ షరీఫ్.

MD AHMAD PASHA, JANGAON
Published on: 24 July 2026 9:38 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో SIR ఫారాలపై ప్రజలకు అవగాహన

జనగామ: కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి జనగామ జిల్లా ముస్లిం డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షులు అడ్వకేట్ మహమ్మద్ జమాల్ షరీఫ్ ప్రజలకు SIR ఫారమ్‌లపై అవగాహన కల్పించారు. జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి జనగామ జిల్లా ముస్లిం డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షులు అడ్వకేట్ మహమ్మద్ జమాల్ షరీఫ్ గారు ఈరోజు జుమ్మా నమాజ్ అనంతరం జనగామ పట్టణంలోని ఏక్ మినార్ మసీదులో ప్రజలను ఉద్దేశించి SIR (Special Intensive Revision) ప్రక్రియపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన ఓటరు SIR ఫారం నెం 3ను పూర్తిగా సరైన వివరాలతో నింపి వీలైనంత త్వరగా సంబంధిత BLOకు అందజేయాలని కోరారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేకపోయిన వారు కూడా తప్పనిసరిగా ఫారం నింపి BLOకు సమర్పించాలని సూచించారు

ఫారంలో పేరు తండ్రి పేరు తల్లి పేరు జీవిత భాగస్వామి పేరు ఓటర్ ఐడీ నంబర్ ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని తెలిపారు.వివరాల్లో తప్పులు ఉంటే సంబంధిత అధికారులు నోటీసులు పంపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

విదేశాల్లో ఉన్న ఓటర్ల తరఫున వారి కుటుంబ సభ్యులు ఫారాలు నింపి సంతకం చేయించి BLOకు అందజేయవచ్చని తెలిపారు.చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫారాలు సమర్పించాలని చివరి రోజుల్లో సర్వర్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు పరిచయస్తులు కూడా SIR ఫారాలు నింపేలా చొరవ తీసుకోవాలని కోరారు ఒక వ్యక్తి పేరు ఒకే ఓటరు జాబితాలో మాత్రమే ఉండాలని రెండు చోట్ల నమోదు ఉండకూడదని స్పష్టం చేశారు.

SIR ఫారాలపై ఎవరికైనా సందేహాలు ఉంటే 9908374693 నంబర్‌లో అడ్వకేట్ మహమ్మద్ జమాల్ షరీఫ్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ గాలిబ్ మొహియుద్దీన్ సలీం అలీముద్దీన్ ఫజల్ అబ్దుల్ మన్నాన్ రజీ మహమ్మద్ ఇక్బాల్ అజం అఫ్జల్ అఫ్సర్ జానీ హకీం సల్మాన్ బాబా మెహబూబ్ మౌలానా ముఫ్తీ అన్సార్, మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story