Jangaon: పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల తాకిడి!
Jangaon: జనగాం జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వైభవంగా ప్రత్యేక పూజలు.
Jangaon: పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల తాకిడి!
Jangaon: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు. స్వామికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కార్తీకమాసం ప్రారంభం కావడంతో సుదూర ప్రాంతాల నుండి స్వామి దర్శనానికి భక్తులు.
శివకేశవులు కొలువై ఉన్నటువంటి క్షీరగిరి పై సంతరించుకున్న కార్తీక శోభ. కనుల పండుగగా అత్యంత వైభవోపేతంగా కార్తిక మాస ఉత్సవాలు ప్రారంభం.
ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణాల మధ్య,,, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ అంటూ భక్తుల నామస్మరణలతో మారుమ్రోగుతున్న దేవాలయం. వేకువ జామునుండే స్వామి దర్శనానికి భక్తులు. దర్శనానికి సుమారు రెండు గంటల సమయం.. క్యూ లైన్ లో భక్తి పారవశ్యంతో, మనసున స్వామిని స్మరిస్తూ, భక్తిశ్రద్ధలతో దర్శనానికై ఎదురుచూపు.
కొండపై కార్తీక దీపాలు వెలిగిస్తూ స్వామి ఆశీర్వాదంకై మహిళలు. ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ. స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తూ అభినందనలు, ఆశీర్వాదాలు తెలుపుతున్న భక్తులు. ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న నిత్య పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.




