Jangaon: జనగామ: సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి రద్దు
Jangaon: ముఖ్యమంత్రి రైతు నేస్తం కార్యక్రమం నేపథ్యంలో అక్టోబర్ 12 సోమవారం జనగామ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
Jangaon: జనగామ: సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి రద్దు
జనగామ జిల్లా: జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం అక్టోబర్ 12 న రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రబీ పంటల ప్రణాళిక పంటల సాగు విధానాలు పంటల వైవిధ్యీకరణ వ్యవసాయ నిర్వహణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో అక్టోబర్ 12వ తేదీ సోమవారం న నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ వినతులు ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ కోరారు.
అయితే డివిజన్ స్థాయి మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ వెల్లడించారు ప్రజలు తమ సమస్యలు, వినతులను సంబంధిత డివిజన్ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో సమర్పించుకోవచ్చని సూచించారు.




