Jangaon: స్టేషన్ ఘన్పూర్లో ట్రాక్టర్ బోల్తా.. రైతు దుర్మరణం!
Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం విశ్వనాథపూర్ గ్రామంలో పొలం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో జంగిలి పరమేశ్ (40) మృతి చెందాడు.
Jangaon: స్టేషన్ ఘన్పూర్లో ట్రాక్టర్ బోల్తా.. రైతు దుర్మరణం!
జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విశ్వనాథపూర్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పొలం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విశ్వనాథపూర్ గ్రామానికి చెందిన జంగిలి పరమేశ్ (40) రోజూ మాదిరిగానే వ్యవసాయ బావి వద్ద పనులు ముగించుకుని ట్రాక్టర్ పై ఇంటికి బయలుదేరాడు.
గ్రామ శివారులోని పిల్ల కాలువ వద్దకు చేరుకునే సరికి ట్రాక్టర్ అదుపు తప్పింది. కాలువకు ఎడమ వైపు ట్రాక్టర్, పక్కనే ఉన్న పొలంలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పరమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.




