Jangaon: జనగామ జిల్లాలో పీహెచ్‌సీ ఉప కేంద్రాల ఆకస్మిక తనిఖీ!

Jangaon: జనగామ జిల్లాలో పలు ఆరోగ్య ఉప కేంద్రాలను డీఎంహెచ్‌వో డాక్టర్ వాణిశ్రీ తనిఖీ చేశారు. గర్భిణుల నమోదు, టీకాల పంపిణీపై సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 25 Aug 2026 10:49 PM IST
Jangaon
X

Jangaon: జనగామ జిల్లాలో పీహెచ్‌సీ ఉప కేంద్రాల ఆకస్మిక తనిఖీ!

జనగామ: జనగామ జిల్లాలో పలు ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వాణిశ్రీ వనపర్తి. ​దేవరుప్పుల PHC పరిధిలోని చిన్నమడూరు, పెద్దమడూరు, సింగరాజుపల్లి ఆరోగ్య ఉప కేంద్రాలలో తనిఖీలు. ​మాతా శిశు సంక్షేమం, టీకాల పంపిణీ, ఎన్‌సిడి (NCD), టీబీ కార్యక్రమాల తీరుపై DMHO పరిశీలన.

​ప్రతి గర్భిణీని 12 వారాలలోపు నమోదు చేయాలని సిబ్బందికి DMHO వాణిశ్రీ ఆదేశం. ​30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసిన జిల్లా వైద్యాధికారి. ​0–15 ఏళ్ల పిల్లలందరికీ సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందించాలని వెల్లడి. ​గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (HPV) టీకాతో పాటు కాలానుగుణ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచన.

​జనగామలోని ART సెంటర్‌ను సందర్శించి వైద్య సేవల తీరును పరిశీలించిన ఎయిడ్స్ ప్రోగ్రామ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ. ​జనగామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైభవంగా ప్రారంభమైన 41వ నేత్రదాన పక్షోత్సవాలు. ​నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం తెచ్చి దృష్టి లోపం ఉన్నవారికి వెలుగులు నింపాలని వైద్యాధికారుల పిలుపు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story