Jangaon: జనగామలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లక్కీ డ్రా.. సెప్టెంబర్ 5న ప్రక్రియ

Jangaon: జనగామ అర్బన్ పరిధిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ చేపట్టనున్నారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 4 Sept 2026 9:19 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లక్కీ డ్రా.. సెప్టెంబర్ 5న ప్రక్రియ

Jangaon: జనగాం మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 5,081 మంది లబ్ధిదారులలో 174 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపునకు డ్రా (లాటరీ) నిర్వహించబడుతుంది.

ఈ మేరకు సంబంధిత లబ్ధిదారుల జాబితాను జనగాం మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రదర్శించడం జరిగింది.

కావున డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డులో తమ పేరును పరిశీలించుకోవలసిందిగా తెలియజేయడమైనది.

*డ్రా నిర్వహించు ప్రదేశం *

తేదీ : 05-09-2026 | సమయం : ఉదయం 09:00 గంటలకు

వేదిక : జనగాం కలెక్టరేట్ కార్యాలయం

కావున సంబంధిత లబ్ధిదారులు నిర్ణీత సమయానికి హాజరై డ్రా ప్రక్రియలో పాల్గొనవలసిందిగా తెలియజేయడమైనది.

ఇట్లు

-తహసీల్దార్ కార్యాలయం,

-జనగామ

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story