Jangaon: లాస్య జన్మదినం వేళ మహోన్నత సేవ దివ్యాంగులకు అన్నదానం!
Jangaon: లాస్య జన్మదినం సందర్భంగా రఘునాథపల్లిలో దివ్యాంగులకు, వృద్ధులకు నవభారతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో అన్నదానం చేసి, కానుకలు అందజేశారు.
Jangaon: లాస్య జన్మదినం వేళ మహోన్నత సేవ దివ్యాంగులకు అన్నదానం!
జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామానికి చెందిన వేల్పుగొండ మహేందర్, మంజుల దంపతుల కుమార్తె లాస్య జన్మదినాన్ని పురస్కరించుకుని రఘునాథపల్లి మండల నవభారతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.అనంతరం లాస్య జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, వారికి కానుకలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్ర కుమార్, మాజీ ఉపసర్పంచ్ మేకల మురళి, బాబు, నర్సింలు, వెంకటస్వామి, బంధ కుమారస్వామి, మైలారం వెంకటేశ్వర్లు, శివప్రసాద్, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు కట్కూరీ వసంత, హైమ తదితరులు పాల్గొన్నారు.




