Jangaon: జనగామ బాలికల జూనియర్ కళాశాలలో ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు!

Jangaon: జనగామ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా ‘ఫ్రెషర్స్ డే’. ముఖ్య అతిథిగా సీడీసీ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు హాజరై విద్యార్థినులకు మార్గదర్శకత్వం.

MD AHMAD PASHA, JANGAON
Published on: 11 Sept 2026 9:26 PM IST
Jangaon
X

Jangaon: జనగామ బాలికల జూనియర్ కళాశాలలో ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు!

జనగామ జిల్లా: జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రాంగణంలో "ఫ్రెషర్స్ డే" వేడుకలను శుక్రవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. నూతనంగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ఘనంగా స్వాగతం పలికారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీడీసీ (CDC) చైర్మన్ శ్రీ గట్టు వెంకటేశ్వర్లు హాజరై ప్రసంగించారు. విద్యార్థినులు చిన్నతనం నుంచే లక్ష్యాలను నిర్దేశించుకొని, ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. సమాజంలో లభించే ప్రతి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.

చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహ పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు ​ఈ వేడుకల్లో జిల్లా ఇంటర్మీడియట్ విద్యారంగ అధికారి (DIEO) శ్రీ జితేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకుల సేవలందుతున్నాయని, వీటిని విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు.

​కళాశాల ప్రముఖులు & నిర్వహణ ఈ సందర్భంగా గర్ల్స్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సునంద గారు విచ్చేసిన అతిథులకు స్వాగతం పలుకుతూ, కళాశాలలో విద్యార్థినుల పురోగతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. బాయ్స్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి పావని కుమారి గారు కూడా విద్యార్థినులను ఉద్దేశించి ప్రోత్సాహక ప్రసంగం చేశారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON