Jangaon: జనగామ జిల్లాలో దారుణం: భార్యపై బేస్‌బాల్ బ్యాట్‌తో భర్త దాడి

Jangaon: జనగామ: ఓబుళకేశ్వరంలో ప్రేమ వివాహం చేసుకున్న భార్యపై మరో మహిళతో వివాహేతర సంబంధంతో భర్త బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేశాడు. పిల్లలతో పరారయ్యాడు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 4 Aug 2026 1:11 PM IST
Jangaon
X

Jangaon: జనగామ జిల్లాలో దారుణం: భార్యపై బేస్‌బాల్ బ్యాట్‌తో భర్త దాడి

జనగామ జిల్లాలో

దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భార్యపై, మరో మహిళతో పరిచయం కారణంగా భర్త బేస్‌బాల్ బ్యాట్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడు ఇద్దరు పిల్లలతో పరారయ్యాడు జనగామ జిల్లా ఓబుళకేశపురం గ్రామానికి చెందిన మహీందర్ రెడ్డి ఎనిమిదేళ్ల క్రితం మాధవిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల మహీందర్‌కు మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి.

ఈ వివాదాన్ని పరిష్కరిస్తానంటూ గ్రామ సర్పంచ్ పిలవడంతో మాధవి అక్కడికి వెళ్లింది అయితే అక్కడికి వచ్చిన మహీందర్ రెడ్డి వెంట తెచ్చుకున్న బేస్‌బాల్ బ్యాట్‌తో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మాధవిని పోలీసులు జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రి వద్దకు చేరుకున్న బాధితురాలి బంధువులు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు దాడి అనంతరం మహీందర్ రెడ్డి ఇద్దరు పిల్లలను తీసుకుని పరారైనట్లు సమాచారం కేసు నమోదు చేసిన జనగామ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు...

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story