Jangaon: నవంబర్ 27న జనగామ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
Jangaon: రూ. 154 కోట్లతో పూర్తయిన జనగామ మెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్‌ను నవంబర్ 27న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు.
Jangaon: నవంబర్ 27న జనగామ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
జనగామ: ఈ నెల 27న ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జనగామ మెడికల్ కాలేజీ భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాదులోని సచివాలయంలో వైద్య సేవల పనితీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రూ.154 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో జనగామ మెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు మంత్రులకు వివరించారు.
ఈ నేపథ్యంలో మంత్రులు మాట్లాడుతూ.. ఈ నెల 27న జనగామ మెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవానికి వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ను, అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, డీఎంఈ వాణి, అకాడమిక్ డీఎం రమాదేవి, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆర్ అండ్ బీ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. శంకర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ నాగమణి, తదితరులు పాల్గొన్నారు.




